calender_icon.png 29 March, 2025 | 11:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శ్రీ గిరి లక్ష్మి నరసింహ స్వామి కల్యాణోత్సవం

24-03-2025 08:37:02 PM

గజ్వేల్: గజ్వేల్ మండలం శ్రీ గిరిపల్లి గ్రామంలోని శ్రీ స్వయంభూ శ్రీ గిరి లక్ష్మి నరసింహ స్వామి కల్యాణోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలకు భక్తులు ఆయా ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన స్వామివారి కల్యాణోత్సవంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రములో ఒకే రేఖపైన వెలసిన మూడు దేవాలయాలు అయినా యాదగిరి, నాచాగిరి, శ్రీగిరి క్షేత్రాలు అన్నారు. కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ చంద్రమోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, పొట్ట యాదగిరి, రాజేశం, శ్రీనివాస్ రెడ్డి, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.