హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శ్రీగాంధారి’. మసాలా పిక్స్ బ్యానర్‌పై ఆర్ కన్నన్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రమిది. సరస్వతి డెవలపర్స్‌తో కలిసి లచ్చురాం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజు నాయక్ తెలుగులో విడుదల చేస్తున్నారు. మిస్టరీ, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించా రు.
మెట్రో శిరీష్, మయిల్‌సామి, తలైవాసల్ విజయ్, ఆడుకాలం నరేన్, స్టంట్ సిల్వా, వినోదిని, పవన్, బ్రిగిడ సాగా, వడివేల్ మురుగన్, కలైరాణి ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాలో హిందూ ట్రస్ట్ కమిటీకి హెడ్ ఆఫీసర్‌గా పనిచేసే యువతిగా హన్సిక నటించారు. ఆమె ‘గంధర్వ కోట’ పురాతన స్మారకానికి సంబంధించిన పరిశోధన చేపట్టడంతో అసలు కథ మొదలవుతుంది. ఒక రాజు నిర్మించిన శతాబ్దాల నాటి ఈ కోటలో ఎన్నో రహస్యాలుంటాయి.
ఆ రహస్యాల్ని ఎలా బయటకు తీసుకువచ్చారు? అన్నది కథ. ఈ సినిమాకు కథను తొల్కప్పియన్ అందించగా, స్క్రీన్ ప్లే బాధ్యతను ధనంజయన్ నిర్వర్తించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బాల సుబ్రమణియన్; సంగీతం: ఎల్వీ గణేశ్ ముత్తు; ఎడిటర్: జిజింత్ర; స్టంట్స్: సిల్వా.