28-04-2025 08:15:46 PM
పాపన్నపేట: శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని దేవస్థానం హుండీలు లెక్కింపు సోమవారం చేపట్టారు. 58 రోజుల హుండీ లెక్కింపు శ్రీ అన్నమయ్య సేవాసమితి కరీంనగర్ వారు, దేవాలయ సిబ్బంది చేత నిర్వహించడం జరిగింది. ఈ లెక్కింపులో 46,08,354/- రూపాయలు వచ్చినట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వాణాధికారి శ్రీ ఏ చంద్రశేఖర్, దేవాదాయ శాఖ స్పెషల్ ఆఫీసర్, సహయ కమిషనర్ శ్రీమతి ఏ సులోచన, స్థానిక పోలీసులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.