calender_icon.png 24 February, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం...

24-02-2025 07:56:21 PM

కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లాలోని దేవదాయ ధర్మదాయ శాఖ వారి ఆధ్వర్యంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం గణేష్ టెంపుల్ నందు ఈనెల 24 సోమవారం నుండి 28 శుక్రవారం వరకు 5 రోజులు పాటు జరుగనున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి పాంచాహ్మిక దివ్య కళ్యాణ మహోత్సవములలో భాగంగా మొదటిరోజు ఉదయం దుర్గామల్లేశ్వర స్వామివారిని పెళ్లి కుమారునిగా, శ్రీ గంగాదేవి, స్వర్ణదుర్గ అమ్మవార్లను పెళ్లి కుమార్తెలుగా అలంకరించి, పసుపు కొట్టి, తలంబ్రాలు కలుపి, తీర్ధ ప్రసాద వినియోగించారు. సాయంత్రం విఘ్నేశ్వర పూజ, రక్షాబంధనము, దీక్షారాధన, అంకురార్పణము, ధ్వజారోహణము, బలిహరణ, నీరాజన మంత్రపుష్పము, తీర్ధ ప్రసాదాలు ఇవ్వబడును. ఇట్టి కార్యక్రమాలలో ఆలయ ఈఓ, అర్చక, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు అయ్యారు.