- సూక్ష్మరూపంలో భక్త కోటిని అనుగ్రహించిన దేవదేవుడు
- తరించి పరవశించిన భక్తజనం
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి) ః అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు దేదీప్యమా నంగా, కన్నుల పండువగా జరుగుతున్నా యి. వందలాది మంది భక్తులు బ్రహ్మోత్స వాలను ప్రత్యక్షంగా వీక్షించి జన్మ ధన్యం అయిందంటూ భక్తి భావనను చాటుకుం టున్నారు.
బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు అయిన బుధవారం నాడు ఆలయంలో నిత్యారాధనలు చతుర్వేద పారాయణాలు మూలమంత్ర జపాలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి మహోత్సవము పంచరాత్ర ఆగమృత్య అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ చక్ర తీర్థ మహోత్సవా న్ని ఆలయ ప్రధాన అర్చకులు, అర్చకులు, యజ్ఞా చార్యులు, వేద పండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు.
శ్రీ చక్ర తీర్థ స్నాన మహోత్సవాన్ని అవబృత మహోత్స మని శాస్త్రం సూచిస్తుందని పండితులు వివరించారు. ఆవ రక్షణ అని మృత్ రక్షిం చువాడు భగవంతుడు ఆయన వైభవాన్ని ఈ వేడుక తెలియజేస్తుందని అర్చకులు తెలిపారు. సుదర్శన చక్రాన్ని శ్రీ స్వామి వారు పుష్కరణలో వేంచేపుచేసి పవిత్ర స్నానం గావించారు. శ్రీ సుదర్శన చక్ర స్నానం వల్ల అత్యంత పవిత్రత పొందిన పుష్కరిణి పునీత అవుతుంది.
పుష్కరణలో భక్తులు శిరస్థానం చేయడం వలన సర్వ పాప ప్రక్షాళన గావించబడుతుందని శా స్త్రం తెలుపుతుందని పండితులు భక్తులకు వివరించారు. నిత్యారాధనల అనంతరం దేవతో ద్వాసన, శ్రీ పుష్పయాగం, డోలా రోహణం, వేడుకలను శ్రీ పంచరాత్ర ఆగ మ శాస్త్రానుసారంగా ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు నిర్వహిం చారు.
శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించబడిన సమస్త దేవతలను తిరిగి వారిని దేవతో ద్వాసన మంత్రములతో వారి వారి స్థానాలకు వేంచేయుటయే దేవ తోద్వాసన అని అర్చకులు తెలిపారు. భగ వంతుడికి అత్యంత ప్రీతికరమైన వేడుకగా పుష్పోత్సవం అని తెలియజేశారు ద్వాదశ రాధన పుష్ప కైంకర్యాలతో అష్టోత్తర సహ స్రనామాలతో అర్చక స్వాములు ఈ వేడు కను అత్యంత ఘనంగా వైభవంగా నిర్వ హించారు.
భగవంతుని సౌలభ్య సౌశీల్యా గుణాలను భక్తకోటి పొంది ఆనందించు తీరు శ్రీ పుష్పయాగ వేడుకలలో దర్శించవ చ్చునని పండితులు వివరించారు. చతుస్థా నార్చన పూర్వకంగా డోలారోహణ వేడుక ను నిర్వహించారు మంచస్తం మధుసూ దనం అని డోలారోహణంలోని శ్రీ స్వామి వారి అమ్మవారిని దర్శించిన ఎంతో పుణ్య ప్రదమని అర్చకులు యజ్ఞాచార్యులు తెలి పారు. బ్రహ్మోత్సవాలలో వేలాది మంది భక్తులతో పాటు ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహా మూర్తి, ఆలయ ఈవో భాస్కరరావు ఆలయ సిబ్బంది అర్చకులు వేద పండితులు పాల్గొన్నారు.