13-02-2025 01:47:33 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన జేఈఈ మెయిన్స్‌లో శ్రీచైతన్య మరోసారి తన సత్తా చాటుకుంది. మొత్తం 42 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా, మల్టిపుల్ సబ్జెక్టులలో 8 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించి సంచలనాత్మక రికార్డును నెలకొల్పారు.
ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్ విద్యా సంస్థల డైరెక్టర్ సుష్మ మాట్లాడుతూ.. ఈ ఏడాది జేఈఈ మొదటి సెషన్‌లో వచ్చిన పర్సంటైల్ మాత్రమే కాకుండా, రాబోయే ర్యాంకుల్లో సైతం శ్రీ చైతన్య విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటుతారని ధీమా వ్యక్తం చేశారు.
నిరంతరం కృషితో పాటు అనితర సాధ్యమైన ప్రోగ్రాములు, ప్రణాళికలు, మైక్రో షెడ్యూల్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్, ర్యాంకింగ్ సిస్టమ్, ఇన్ఫినిటీ లెర్న్ ఆన్‌లైన్ యాప్‌తో పాటు దేశంలోనే టాప్ ఫ్యాకల్టీ శిక్షణ వల్లనే ఈ ఫలితాలు సాధ్యం అయ్యాయని అన్నారు.