23-04-2025 01:11:06 AM
కరీంనగర్, ఏప్రిల్ 22 (విజయ క్రాంతి): ఇంటర్-2025 ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలలో శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయభేరి మ్రోగించారు. శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డి అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను బొకెలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సంవత్సర ఫలితాలలో యం.పి.సి విభాగంలో 1000 గాను ఆర్ వైష్ణవి 993, ఎ. లాస్వికా 992, జి. శ్రీనిత్య 991, పి. భరత్ రెడ్డి 991, ఇ. అకిరానందన్ 991, బైపిసి విభాగంలో ఎ. అభ్యుదయ 994, ఎన్. భార్గవి 992, పి. స్పూర్తిశ్రీ 990, బి. రోహిత్ 990. సిఇసి విభాగంలో ఎ. మధుమిత 961, యంఇసి విభాగంలో మెరుగు భానుప్రకాశ్ 951 మాకు సాధించారని తెలిపారు.
మొదటి సంవత్సర ఫలితాలలో యం.పి.సి. నందు ఎ. లక్ష్మిహసిని 468, జి. శ్రీహిత 467, పి. హసిని రావు 467, యం. సాత్విక 467, జి. శ్రీనిధి 467, కె. మైత్రి 467, 466 నందు 22 విద్యార్థులు, 465 నందు 14 విద్యార్థులు, బైపిసి విభాగంలో ఈ. అఖిల 437, ఔష సినివాసన్ 437, యస్ విఘ్న 436, వి. లహరి 436, అర్ అక్షయశ్రీ 436, సిహెచ్. కార్తిక్ 436, 430 పైగా మార్కులు 13 మంది, యంఇసి. విభాగంలో ఎల్ కమలేశ్ కుమార్ 474, సూర మనీష 470. సిఇసి విభాగంలో టి. హరిణి 492, కె. అంజలి 491 మార్కులు సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి గారు, డీన్ జగన్ మోహన్ రెడ్డి, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ మల్లారెడ్డి, రాధాక్రిష్ణ, మోహన్రావు, ఎజియం శ్రీనివాస్,అధ్యాపక, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.