calender_icon.png 19 January, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్జాతీయ పోటీల్లో ‘శ్రీచైతన్య’ ప్రతిభ

07-07-2024 02:03:01 AM

నాసా స్పేస్ సెటిల్‌మెంట్‌లో మెరిసిన విద్యార్థులు

ఇబ్రహీంపట్నం, జూలై 6: రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని శ్రీచైతన్య స్కూల్ విద్యార్థులు ప్రతిష్టాత్మక నాసా స్పేస్ సెటిల్‌మెంట్ పోటీలో ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా శనివారం పాఠశాలలో బహుమతుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బీ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు నాసా స్పేస్ సెటిల్‌మెంట్ పోటీలో విజయం సాధించడం శ్రీ చైతన్యలో అందుతున్న నాణ్యమైన విద్యకు నిదర్శనమని అన్నారు.

పోటీలు ప్రతిభ చాటిన పీ సంకీర్త్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో మొదటి బహుమతి, వేద శ్రీ 3వ బహుమతి గెలుచు కున్నట్లు తెలిపారు. నాసా స్పేస్ సెటిల్‌మెంట్ పోటీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను అంతరిక్ష స్థావరాల కోసం ప్రతిపాదనలను రూపొందించడానికి ప్రోత్సహించేది అని పేర్కొన్నారు. పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు పాల్గొనగా, తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారని అన్నారు. కార్యక్రమంలో దిల్‌సుఖ్‌నగర్ జోన్ ఏజీఎం సతీష్, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, రవీందర్ రెడ్డి, దిల్‌సుఖ్‌నగర్ జోన్ కోఆర్డినేటర్ పుల్లారావు, రఘువంశీ, జితేందర్, హుస్సేన్, వైస్ ప్రిన్సిపాల్ వాహిని, డీన్స్ సాయికుమార్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.