29-04-2025 01:08:44 PM
సంబరాలు జరిపిన ఉపాధ్యాయులు
మంచిర్యాల,(విజయక్రాంతి): జెఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాలలో జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకును సాధించిన శ్రీ చైతన్య సక్సెస్ మీట్ ను మంగళవారం మంచిర్యాలలో నిర్వహించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు, బస్టాండ్, మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ లలో బ్రేడ్, పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. ప్రతిష్టాత్మక జెఈఈ మెయిన్స్ పరీక్షలో హైదరాబాద్ శ్రీ చైతన్య హైదరాబాద్ విద్యార్థి అజయ్ రెడ్డి వంగాల (300/300) పర్సెంటైల్ సాధించి ఆల్ ఇండియా నంబర్ వన్ స్థానంలో నిలిచారన్నారు. మంచిర్యాల శ్రీ చైతన్య పాఠశాల నుంచి పట్టణంలోని ఒక వీధుల గుండా శ్రీ చైతన్య జెండాలు, విజయ నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరక్టర్ నాగేంద్ర, శ్రీ విద్య, మంచిర్యాల ఏజీఎం అరవింద్ రెడ్డి, హైదరాబాద్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్, మంచిర్యాల శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ అయూబ్, ఏఓ విల్లాస్, కోఆర్డినేటర్ నాగరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.