20-03-2025 12:00:00 AM
ఎల్బీనగర్, మార్చి ౧౯ : చంపాపేట డివిజన్ కర్మన్‌ఘాట్ లోని శ్రీ చైతన్య స్కూల్ యజమాన్యం ఫీజులు చెల్లించని టెన్త్ క్లాస్ విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వలేదు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, విద్యార్థి సం ఘాల నాయకులు బుధవారం ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం హాల్ టికెట్ విషయంలో విద్యార్థులు ఇబ్బంది పెట్టొద్దని చెప్పినా శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం పెడచెవిన పెట్టింది.
డబ్బులు కట్టేంతవరకు హాల్ టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని ప్రిన్సిపాల్ మాధవి చెప్పారు. విషయం తెలుసుకున్న ఎన్‌ఎస్ యూఐ నాయకులు, లింగోజి గూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు.
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుద్దంటూ స్కూల్ యాజమా న్యానికి కాంగ్రెస్ నాయకులు సూచించారు. స్కూల్ విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న శ్రీ చైతన్య స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. వెంటనే యాజమా న్యం స్పందించి టెన్త్ క్లాస్ విద్యార్థు లకు హాల్ టికెట్స్ ఇచ్చారు.