calender_icon.png 20 April, 2025 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్టులో శ్రీచైతన్య ఛాంపియన్

04-04-2025 01:19:09 AM

వరుసగా 13వసారి విజయ దుందుభి

హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): అమెరికా నాసా ఎన్‌ఎస్ ఎస్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ 2025లో శ్రీచైతన్య స్కూల్ వరుసగా 13వసారి విజయ దుందుభి మోగించింది. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలు పాల్గొన్న ఈ పోటీలో ఇండియాకు మొత్తం 60 అవార్డులు రాగా అందులో 50శాతం అంటే 30 అవార్డులు ఒక్క శ్రీ చైతన్య విద్యార్థులే సాధించటం ద్వారా ఇండియాను ప్రపంచ నం.1 గా నిలబెట్టారు. శ్రీచైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సీమ మాట్లాడుతూ.. వరుసగా మూడవసారి కూడా శ్రీ చైతన్య స్కూలు క్యాష్ అవార్డులను గెలుచుకోవటం గర్వకారణమన్నారు. ఇంతవరకు ప్రపంచంలో ఏ విద్యాసంస్థ ఇటువంటి ఘనత సాధించలేదని ఆమె అన్నారు. తమ స్కూలు నుంచి ఈ 30 అవార్డుల విన్నింగ్ ప్రాజెక్టులలో 369 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలను ఇంతటి ఘన విజయంతో ప్రపంచ నం.1 గా నిలపటంలో భాగస్వాములైన విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బందిని ఆమె అభినందించారు.