calender_icon.png 11 January, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాక్ ఏ గ్రేడ్ అవార్డు పొందిన శ్రీ చైతన్య కళాశాల

11-01-2025 12:17:46 AM

మానకొండూర్, జనవరి 10: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళా శాలకు నాక్ ఏ గ్రేడ్ అవార్డును సాధించిం దని కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈనెల 3 4 తేదీలలో తమ కళాశాలలో జరిగినటువంటి పరిశీలన లో విద్యతో పాటు ఉద్యోగ ఇతర ప్రమాణా లను గుర్తించి కళాశాలకు ఉన్నతమైన ఏ గ్రేడ్ అవార్డును అందించారని పేర్కొన్నారు.

తమ కళాశాల ఏ గ్రేడ్ సాధించడం సంతోష దాయకమని రాబోయే రోజుల్లో మరింత సమర్థవంతంగా గుణాత్మకంగా విద్యను అం దించేందుకు ప్రేరణ ఇస్తుందని అన్నారు  అటానమస్ హోదా పొందేందుకు అహర్ని శలు పాటుపడుతున్నామని స్పష్టం చేశారు. విద్యార్థిని విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి మన ధ్యేయంగా పనిచేస్తామని కళాశాలలో మంచి వసతులతో పాటు ఉన్న త విద్యను అందించి క్రీడా రంగాల్లో సైతం రాణించేలా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, మీడియా ఇన్ఛార్జ్ గుంటి రమేష్, లతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.