23-04-2025 01:44:26 AM
డీజీపీకి ఏఐఎస్‌ఎఫ్ ఫిర్యాదు
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాం తి): ‘జేఈఈ మెయిన్స్ ఫలితాలకు సంబంధించి ‘శ్రీచైతన్య’, ‘నారాయణ’ యాజమాన్యాలు తప్పుడు ప్రకటనలు ఇస్తూ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయి. ఆయా సంస్థలపై చీటింగ్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి’ అని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణి కంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నేతలు మంగళవారం డీజీపీ జితేందర్‌ను కలిసి ఫిర్యా దు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నారాయణ విద్యాసంస్థ నుం చి శివన్ వికాస్ టోష్నీవాల్ అనే విద్యార్థి (హాల్ టికెట్ నం: 250310 391420 ) 9వ ర్యాంక్ సాధించాడని, అలా గే సౌరవ్ అనే విద్యార్థి (హాల్ టికెట్ నం: 250310254844) 12వ ర్యాంకు సాధించారని పేపర్లలో ప్రకటన ఇచ్చిందని, శ్రీచైతన్య యాజమాన్యం కూడా శివన్ వికాస్ టోష్నీవాల్, సౌరవ్ పేర్లను, ర్యాంకర్లను వాడుకున్నదని, పత్రికల్లో రెండు సంస్థల యాజ మాన్యాలు ఆ ఇద్దరి పేర్లనే ప్రచారం చేసుకుంటున్నాయని పేర్కొన్నారు.
శ్రీచైతన్య విద్యాసం స్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా సినీతారలు అల్లు అర్జున్, శ్రీలీల వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ఎవరూ బ్రాండ్ అంబాసిడర్లు వ్యవహరించొద్దని విద్యాశాఖ ప్రకటన జారీ చేయాలన్నారు. గ్యార నరేశ్, వంశీవర్ధన్‌రెడ్డి, హరీశ్, రఘు ఉన్నారు.