13-04-2025 01:55:43 AM
కొత్త టెస్ట్ ప్రిపరేషన్ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): విద్యారంగంలో సంచలన విజయాలు అందుకుంటూ 40 ఏండ్లుగా ఎదురులేని విద్యాసంస్థగా ఉన్న శ్రీచైతన్య ఐఐటీ నీట్‌లో విజయాలే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని సుచిత్రలో కొత్తగా టెస్ట్ ప్రిపరేషన్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ లాంఛనంగా ప్రారంభించారు. జేఈఈ, నీట్ వంటి ఉన్నత స్థాయి పరీక్షలకు ఈ కేంద్రంలో శిక్షణనివ్వనున్నారు.
కాగా ఇది హైదరాబాద్ నగరంలో 7వ కేంద్రంగా శ్రీచైతన్య యాజమాన్యం తెలిపింది. శ్రీచైతన్య విద్యాసంస్థల సీఈవో, డైరెక్టర్ సుష్మా బొప్పన 40 ఏండ్లుగా విద్యార్థుల అత్యున్నత కలలను శ్రీచైతన్య సాకారం చేస్తుందని చెప్పారు. 2023లో జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, నీట్‌లోని ఏఐఆర్ విభాగంలో మొదటి స్థానాలను దక్కించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇన్ఫినిటీ లెర్న్ వ్యవస్థాపక సీఈవో ఉజ్వల్ సింగ్ మాట్లాడుతూ.. తమ నిరూపిత బోధనా విధానం, అత్యాధునిక సాంకేతికతతో, ప్రతీ అభ్యాసకుడి కలలను సాకారం చేసేందుకు సహాయం చేస్తుందని చెప్పారు.