calender_icon.png 4 April, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లకి బహూకరణ

24-03-2025 12:00:00 AM

ముషీరాబాద్, మార్చి 23: (విజయక్రాంతి):  భోలక్ పూర్ డివిజన్లోని బాకారం లో ప్రసిద్ధిగాంచిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఉత్సవాల  ఊరేగింపునకు ముషీరాబాద్‌కు చెంది న స్వామి వారి భక్తుడు సతీష్ ప్రత్యేకంగా తయారు చేసిన పల్లకి సేవలను ఆలయ కమిటీ మేనేజింగ్ ట్రస్టీ నల్లవె ల్లి అంజిరెడ్డికి అందజేశారు. ఈ మేర కు ఆదివారం ఆలయ ప్రాంగణంలో స్వామివారి పల్లకిని వేద పండితులు మధుసూదనాచారిచే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నల్లవెల్లి అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వ హిస్తూ స్వామివారిని అలంకరించి పల్లకిలో పురవీధుల్లో ఊరేగించి భక్తులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఊర్మిళ అంజిరెడ్డి, భక్తు లు గోక నవీన్ ముదిగొండ మురళి, రామానంద రెడ్డి సురేష్ కుమార్, జ్ఞానేశ్వర్ గౌడ్, రాజు పాల్గొన్నారు.