ముషీరాబాద్ (విజయక్రాంతి): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్ పూర్ డివిజన్ బాకారంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి (మల్లన్న) ఆలయంలో సోమవారం స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ నల్లవెల్లి అంజిరెడ్డి దంపతులు దృష్టి కుంభం కోసం బియ్యం పోసి పూజలు ప్రారంభించారు. ఒగ్గు పూజారులచే స్వామి వారిని కొలుస్తూ బ్రహ్మోత్సవాలను వైభవంగా ప్రారంభించారు. భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకుని తమ మొక్కలను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నల్లవెల్లి ఊర్మిల అంజిరెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, హారిక రెడ్డి, సురేష్, రాజు, గోపి, ఒగ్గు పూజారులు సిద్ధం నాగేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.