calender_icon.png 12 February, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళ్యాణం కమనీయం...

11-02-2025 07:31:26 PM

కన్నుల పండుగగా శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం...

పట్టు వస్త్రాలు సమర్పించి పాల్గొన్న కలెక్టర్ దంపతులు..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయకాంతి): రెబ్బెన మండలం రంగాపూర్ లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో మంగళవారం వేద పండితులు దుద్దిల్ల నారాయణ శర్మ, ధీరజ్ శర్మ, ఆలయా అర్చకులు గణేష్ శర్మ, దినేష్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగ, పద్మావతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఏఎస్పి చిత్తరంజన్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణంలో పాల్గొన్నారు. పండితులు కుంకుమార్చన పుష్పాభిషేకం అర్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో 100కు పైగా జంటలు పాల్గొన్నాయి.

బ్రహ్మాండ నాయకుడైన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వివాహ మహోత్సవం కమనీయంగా జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో బాలాజీ వెంకటేశ్వర స్వామి కొలువు దీరడం జిల్లా ప్రజల అదృష్టం అన్నారు. సందర్భంగా మూడురోజుల పాటు జరగనున్న వేడుకలలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. భక్తులు అధికార యంత్రాంగానికి పోలీస్ లకు సహకరించాలని కోరారు. వేడుకలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాదరావు, నియోజకవర్గం ఇంచార్జ్ శ్యాం నాయక్, నాయకులు వనమాల మురళి, గంటు మేర, సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.