calender_icon.png 12 February, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మర్మోగిన గోవిందా నామస్మరణ...

12-02-2025 08:31:47 PM

వైభవంగా రథోత్సవం..

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ దండేవిటల్, ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఎస్పీ శ్రీనివాస్ రావు..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలోని శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి జాతర బుధవారం వైభవంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు బారులు తీరారు. సాయంత్రం స్వామి వారి రథోత్సవం కనుల పండువగా సాగింది. మండల కేంద్రానికి నాలుగు కిలో మీటర్ల దూరంలోని గంగాపూర్ గ్రామ సమీపంలో మూడు రోజుల పాటు జరిగే ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజైన బుధవారం భక్తజనం పరమ పవిత్రంగా భావించడంతో వేకువజామున నుండి భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఏఎస్పీ చిత్తరంజన్, అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.