కలెక్టర్ వెంకటేష్ ధోత్రే...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రెబ్బెన మండలం గంగాపూర్ లో జరగనున్న శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి జాతరను అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శనివారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎ. ఎస్. పి. చిత్తరంజన్, ఆర్డిఓ లోకేశ్వర్ రావులతో కలిసి గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. సంబంధిత అధికారులు, జాతర కమిటీ ప్రతినిధులతో ఈ నెల 11 నుండి 13వ తేదీ వరకు జరగనున్న గంగాపూర్ జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... గంగాపూర్ వెంకటేశ్వర స్వామి జాతరను ఘనంగా నిర్వహించే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. దేవాదాయ శాఖ అధికారులు జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం వాహనాల పార్కింగ్ కొరకు స్థలాన్ని చదును చేయాలని, కమిటీ ప్రతినిధులతో కలిసి దేవాలయాన్ని అందంగా ఉండేలా రంగులతో తీర్చిదిద్దాలని తెలిపారు. గుడిని విద్యుత్ దీపకాంతులతో అలంకరించాలని, భక్తుల కొరకు ఆలయ ప్రాంతాలలో షామియాన ఏర్పాటు చేయాలని తెలిపారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి సమన్వయంతో ఆహ్వాన పత్రికలు, ఫ్లెక్సీలు సిద్ధం చేయాలని, జాతరలో ఏర్పాటుచేసి దుకాణాల వేలంపాటపై పత్రికలలో ప్రకటనలు వచ్చేలా చూడాలని తెలిపారు. వేల పాటలే వచ్చే ఎన్నికలతో జాతరలో ఏర్పాట్లపై ఖర్చు చేయాలని, జాతరలో సి సి కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. స్వామి వారి కళ్యాణ ఉత్సవాలకు ఇలాంటి ఇబ్బందులు రాకుండా దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లా పంచాయతీ రాజ్, జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో జాతరలో పారిశుధ్య చర్యలు తీసుకోవాలని, 50 మంది కార్మికులతో పనుల కొరకు సిబ్బందిని సర్దుబాటు చేయాలని తెలిపారు. జాతరలో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, సమీప గ్రామపంచాయతీల నుండి గ్రామీణ నీటి సరఫరా అధికారులు సమన్వయం చేసుకొని నీటి ట్యాంకులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. మండలంలోని 12 మంది పంచాయతీ కార్యదర్శులను పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణపై నియమించాలని తెలిపారు. రోడ్లు భవనాల శాఖ అధికారులు పోలీసు శాఖ అధికారుల సమన్వయంతో వాహనాల పార్కింగ్ ప్రాంతాలలో భారీ కేడ్లు, జాతర ఏర్పాట్లపై ప్రణాళిక రూపొందించి సిబ్బందిని అందుబాటులో ఉంచాలని తెలిపారు.
గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు 3 రోజుల పాటు ప్రతి 500 మీటర్ల పరిధిలో త్రాగునీటిని ఏర్పాటు చేయాలని, ప్రముఖులు, భక్తులు, పోలీసు సిబ్బంది, పార్కింగ్ ప్రాంతాలలో తాత్కాలిక మూత్రశాలలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో జాతరలో శాంతి భద్రతల పరిరక్షణ దిశగా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని, పార్కింగ్ ప్రాంతంలో సింగరేణి సంస్థ సమన్వయంతో లైట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 24 గంటలపాటు వైద్య శిబిరాలు నిర్వహించాలని, అత్యవసర సేవల కోసం 2 అంబులెన్స్ లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో 3 రోజులపాటు నిరంతర విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయంగా జనరేటర్ లను అందుబాటులో ఉంచాలని, 4 మంది లైన్ మెన్లను నియమించాలని తెలిపారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో జరగకుండా వాహనాన్ని, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఆర్టిసి శాఖ వారు 22 బస్సులను వివిధ ప్రాంతాల నుండి నడిపించాలని, గంగాపూర్ కు వచ్చే వాహనాలు క్రమ పద్ధతిలో వచ్చే విధంగా పోలీసు శాఖ అధికారులకు సహకరించాలని తెలిపారు.
ఫోన్ ఎప్పుడు అధికారులు వారికి కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు నిర్వహించాలని తెలిపారు. గత జాతరలో విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బంది జాతరలో ఇబ్బందులు లేకుండా పని చేయాలని, తహసిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు 3 రోజులపాటు జాతర నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, డివిజనల్ పంచాయతీ అధికారి ఉమర్ హుస్సేన్, రెబ్బెన సి.ఐ. బుద్దె స్వామి, రెప్పెన తహసిల్దార్ రామ్మోహన్, ఆలయ కార్య నిర్వహణ అధికారి, దేవస్థాన కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.