calender_icon.png 23 March, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పల్‌లో సన్ రైజర్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ మ్యాచ్

21-03-2025 05:43:41 PM

2,700 మంది పోలీసులతో భారీ బందోబస్తు

బ్లాక్ లో టిక్కెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు రాచకొండ సీపీ సుధీర్ బాబు

ఉప్పల్,(విజయక్రాంతి): హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్ నేషనల్ స్టేడియం(Rajiv Gandhi International Cricket Stadium)లో ఆదివారం మధ్యాహ్నం 3  గంటలకు జరిగే హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినట్టు రాచకొండ సీపీ సుధీర్ బాబు(Rachakonda CP Sudheer Babu) తెలిపారు. 18వ ఎడిషన్ IPL-2025 పురస్కరించుకొని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...ఉప్పల్ స్టేడియం 39,000 మంది సిట్టింగ్ సామర్థ్యం ఉందని, స్టేడియం పరిసరాల ప్రాంతాల్లో 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వివిధ విభాగాలకు చెందిన సుమారు 2,700 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తుతో ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రజలు పోలీసులు సూచించిన మార్గంలోనే వెళ్లాలన్నారు. ఎవరైనా బ్లాక్ లో టిక్కెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టినట్టు ఆయన తెలిపారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మధ్యలో ఎవరు స్టేడియంలోకి రావద్దని సూచించారు. వాహనాల పార్కింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. బస్సులు, మెట్రో రైళ్ల సమయాల్లో మార్పులు చేశామని, స్టేడియంలోకి లాప్ టాప్స్, బ్యానర్స్, వాటర్ బాటిల్స్, కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, హెల్మెట్స్, బ్యాగ్స్, బయట ఫుడ్, నిషేధమని సీపీ తెలిపారు.