ప్లేఆఫ్స్‌కు హైదరాబాద్
గుజరాత్‌తో మ్యాచ్ రద్దు
చివరి బెర్తు కోసం తీవ్ర పోటీ
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. సొంతగడ్డపై అభిమానుల సమక్షంలో రైజర్స్ దంచికొట్టి ముందడుగేస్తుందనుకుంటే.. వరుణుడు అడ్డు పడి ఆ శ్రమ కూడా లేకుండా చేశాడు. మ్యాచ్ చూద్దామని వచ్చిన ప్రేక్షకులకు వర్షం రూపంలో నిరాశ ఎదురైనప్పటికీ 2020 తర్వాత హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరడం సంతోషాన్నిచ్చింది. గత మూడు సీజన్లుగా ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైన రైజర్స్ ఈ సీజన్‌లో మాత్రం దుమ్మురేపింది. ఇక చివరి మ్యాచ్‌లోనూ సత్తాచాటితే రైజర్స్‌కు టాప్ నిలిచే అవకాశం ఉండగా.. విజయంతో సీజన్‌కు ముగింపు పలకాలనుకున్న గుజరాత్ టైటాన్స్‌కు నిరాశ తప్పలేదు.
విజయక్రాంతి ఖేల్ ప్రతినిధి: ఐపీఎల్ 17వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరింది. ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది. ఫలితంగా హైదరాబాద్ 15 పాయింట్లతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడో జట్టుగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ చేరడం 2020 తర్వాత మళ్లీ ఇదే కావడం విశేషం. ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగా.. తాజాగా రైజర్స్ కూడా అడుగుపెట్టడంతో చివరి బెర్తు కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. లీగ్‌లో భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి.
టాస్ పడకుండానే..
నగరంలో మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. ఉప్పల్‌లోనూ వర్షం దంచికొట్టింది. దీంతో టాస్ వేసే అవకాశం లేకుండా పోయిం ది. మధ్యలో వరుణుడు కాస్త తెరిపినివ్వడంతో మ్యాచ్ జరిగేందుకు వీలుగా గ్రౌండ్‌ను సిద్ధం చేశారు. రాత్రి 8 గంటలకు టాస్ వేయాలనుకున్నప్పటికి వర్షం మరోసారి జోరందుకుంది. దీంతో మ్యాచ్ నిర్వహించడం సాధ్యపడలేదు. దీంతో హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరింది. అయితే లీగ్ దశను రెండో స్థానంతో ముగించే అవకాశం రైజర్స్ ముంగిట ఉంది. సీజన్‌లో చివరి లీగ్ మ్యాచ్‌ను పంజాబ్‌తో ఆడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే హైదరాబాద్ 17 పాయింట్లకు చేరుతుంది. 16 పాయింట్లతో ఉన్న రాజస్థాన్ తమ చివరి మ్యాచ్‌లో ఓడితే మూడో స్థానానికి పడిపోనుంది. ఇక నాలుగో స్థానం కోసం చెన్నై.. బెంగళూరుతో తలపడ నుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే 16 పాయింట్లతో చెన్నై నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టనుంది.
పాయింట్ల పట్టిక 2024
జట్టు మ్యా గె ఓ ఫ.తే ర.రే పా
కోల్‌కతా 13 9 3 1 1.42 19
రాజస్థాన్ 13 8 5 ౦ 0.27 16
హైదరాబాద్ 13 7 5 1 0.40 15
చెన్నై 13 7 6 ౦ 0.52 14
ఢిల్లీ 14 7 7 ౦ 14
బెంగళూరు 1౩ 6 7 ౦ 0.38 12
లక్నో 1౩ 6 7 ౦ 12
గుజరాత్ 14 5 7 2 12
పంజాబ్ 13 5 8 ౦ 10
ముంబై 13 4 9 ౦ 8
నోట్: మ్యా గెఫ.తే తేలనివి, ర.రే పాక్షవూ