13-02-2025 02:23:49 AM
బాన్సువాడ, ఫిబ్రవరి 12 ః కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గౌరారం గ్రామం ఎక్కకుంట తండాలో సంత్ శ్రీ రవిదాస్ మహారాజ్ జయంతి జరుపుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి కటారి ప్రేమ్ సింగ్ తాండ పెద్దలు దీప్ చంద్,లక్ష్మణ్,వినోద్, రామ్ విద్యార్థులు పాల్గొన్నారు.
రావిదాస్ మహారాజ్ చేసిన గొప్ప పనులు సమాజంలో అసమానతలపై ఆయన చేసిన బోధనల గురించి మరియు ఆయన కృషిని అందరికీ తెలిసేటట్టుగా చెప్పడం జరిగింది ఇలా మన కమ్యూనిటీ నుంచి ప్రతి విలేజ్లో 12 ఫిబ్రవరి నాడు అందరూ సంత్ శ్రీ రవిదాస్ మహారాజ్ జయంతిని జరుపుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు.