calender_icon.png 7 October, 2024 | 2:57 AM

శ్రీజేష్‌కు తొలి పరీక్ష

07-10-2024 12:49:18 AM

1 - అత్యధిక సార్లు టైటిళ్లు గెలుచుకున్న జట్టుగా గ్రేట్ బ్రిటన్‌తో కలిసి భారత్ తొలి స్థానంలో కొనసాగుతోంది. 

సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్‌కు జట్టు ప్రకటన

బెంగళూరు: భారత జూనియర్ హకీ జట్టుకు కోచ్‌గా నియమితుడైన సీనియర్ గోల్ కీపర్ శ్రీజేష్‌కు సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ రూపంలో తొలి పరీక్ష ఎదురవనుంది. మలేషియా వేదికగా అక్టోబర్ 19 నుంచి జరిగే ఈ టోర్నీ కోసం 18 మందితో కూడిన జూనియర్ హాకీ జట్టును ప్రకటించారు.

అమిర్ అలీ నేతృత్వంలోని ఈ జట్టు అక్టోబర్ 19న జపాన్‌తో, అక్టోబర్ 20న గ్రేట్ బ్రిటన్‌తో, అక్టోబర్ 22న మలేషియాతో, అక్టోబర్ 23న ఆస్ట్రేలియాతో తలపడనుంది. అక్టోబర్ 26న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ‘సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ మాకు ఎల్లప్పుడూ ముఖ్యమే. ఈ టోర్నీ మాకు లిట్మస్ టెస్ట్ వంటిది.

జూనియర్ ఆసియా కప్ జరగనున్న నేపథ్యంలో ఇక్కడ సత్తా చాటడం ఎంతో ముఖ్యం’ అని కెప్టెన్ అమిర్ అలీ పేర్కొన్నట్లు హాకీ ఇండియా తెలిపింది. ఈ టోర్నీలో డిఫెండర్ రోహిత్ భారత్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. బిక్రమ్‌జిత్ సింగ్, అలీఖాన్ గోల్ కీపర్లుగా ఆడనున్నారు. 2022లో షూటౌట్‌లో గెలిచిన భారత్.. 2023లో మాత్రం మూడో స్థానంతో సరిపెట్టుకుంది. మరి ఈ సారి శ్రీజేష్ బాయ్స్ ఏ మేరకు రాణిస్తారో..