21-03-2025 12:00:00 AM
హీరో శ్రీ విష్ణు ఈ వేసవిలో తన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘సింగిల్’తో ప్రేక్షకులను అలరిం చేం దుకు సిద్ధమవుతున్నాడు. ‘నిను వీడని నీడను నేనే’ మూవీ ఫేమ్ కార్తీక్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కళ్యా ఫిల్మ్స్ తో కలిసి ఈ చిత్రాన్ని విద్యా కొ ప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. మేకర్స్ అధికారికంగా ప్రకటించినట్లుగా ‘సింగిల్’ మే 9న ఈ సినిమా థియేటర్లలోకి విడుదల కానుం ది. రిలీజ్ పోస్టర్ మూవీ హ్యూ మర్ నేచర్‌ని హైలైట్ చేస్తోంది. శ్రీ విష్ణు ఈ చిత్రంలో పగటిపూట కేర్ ఫ్రీ ఫ్రెండ్‌గా, నైట్ రొమాంటిక్ పర్సన్‌గా రెండు విభిన్న కోణాల్లో కనిపించనున్నాడు. శ్రీ విష్ణు సరసన కేతిక శర్మ, ఇవాన హీరోయిన్లుగా నటిస్తున్నారు.