calender_icon.png 9 October, 2024 | 11:48 AM

శ్రీవిష్ణును కమల్‌హాసన్‌తో పోల్చవచ్చు

03-10-2024 12:00:00 AM

హీరో -శ్రీవిష్ణు నాలుగు విభిన్న పాత్రల్లో నటించిన చిత్రం ‘శ్వాగ్’. హసిత్ గోలి దర్శకత్వంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 4న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “శ్వాగ్’ సినిమా వంశాలు, తరాలకు సంబంధించిన కథ. తెలుగు ప్రేక్షకుల ప్రోత్సాహం వల్ల మేం గెలుస్తూ ఉంటాం. ఈసారి మిమ్మల్ని గెలిపించాలనుకుంటున్నా. దానికోసం ఎంతో కష్టపడ్డాం. నిజంగా మీకు సినిమా నచ్చితే రెండు చప్పట్లు కొట్టండి. అంతకంటే ఆశించడం లేదు” అన్నారు.

నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ‘మాకు గూఢచారి, ఓ బేబీ, కార్తికేయ2 చాలా పెద్ద సక్సెస్ ఇచ్చాయి. శ్వాగ్ కూడా అలాంటి సక్సెస్ ఇస్తుంది. ఈ మూవీలో నటనకు శ్రీవిష్ణు గారిని, కమల్‌హాసన్ గారితో పోల్చవచ్చనేది ధైర్యంగా చెప్పొచ్చు’ అని భావిస్తున్నా’ అని తెలిపారు. మిగతా చిత్రబృందం సభ్యులంతా ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు.