calender_icon.png 23 January, 2025 | 10:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయి టోర్నమెంట్‌కు శ్రావ్య

03-12-2024 12:14:37 AM

కామారెడ్డి, డిసెంబర్ 2 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సంతోష్ కుమర్తె శ్రావ్య జాతీయస్థాయి హాకీ టోర్నమెంట్‌కు ఎంపికైంది. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న శ్రావ్య ఆర్‌ఆర్బీ గ్రౌండ్‌లో నిర్వహించనున్న హకీ పోటీలకు తెలంగాణ జట్టు తరఫున పాల్గొననున్నది. సోమవారం బీసీ రాజ్యాధికార సమితి కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రావ్య ను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల శంకర్, తెలంగాణ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు కాముని సుదర్శన్, బీసీ రాజ్యాధికార సమితి జిల్లా ఇన్‌చార్జి సూర్య మల్లేష్, కో ఇన్‌చార్జి చింతల శంకర్, జిల్లా స్పెషల్ మీడి యా ఇన్‌చార్జి రాజేందర్, రాజంపేట మం డల అధ్యక్షుడు మురళి,  పాల్వంచ మండల ఇన్‌చార్జి బాలకృష్ణ, పాల్వంచ అధ్యక్షుడు ఆంజయ్య, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు రాజయ్య, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.