02-04-2025 09:31:00 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో నిందితుడు శ్రవణ్ రావు(Sravan Rao)ను సిట్(SIT) అధికారులు బుధవారం మారోసారి విచారించనున్నారు. మూడు రోజుల క్రితం విచారించిన సిట్ అధికారులకు అసంపూర్తిగి సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఇవాళ విచారణకు హాజరుకావాలని ఇప్పటికే శ్రవణ్ రావుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో శ్రవణ్ రావు విచారణకు హాజరుకానున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ6గా ఉన్న శ్రవణ్ రావు ఓ మీడియా సంస్థ అధినేతగా ఉన్నారు. ఈయన సూచనల మేరకే కీలక నిందితులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు నడుచుకున్నట్లు దర్యాప్తు సంస్థ ప్రధాన అభియోగం. గతేడాది మార్చిలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చిన వేంటనే శ్రవణ్ రావు అమెరికా వెళ్లిపోయారు. విచారణకు హాజరుకాకుండా కొంతకాలం అక్కడే ఉండి సుప్రీంకోర్టులో మధ్యంతర ఉత్తర్వుల రావడంతో ఊరట లభించింది. దర్యాప్తుకు తప్పనిసారిగా సహాకరించాలన్న షరతుల మేరకు జూబ్లీహిల్స్ పీఎస్ లో సిట్ ముందు హాజరుపరిచారు.