calender_icon.png 23 April, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ ఫలితాల్లో ఎస్సార్ విద్యార్థుల ప్రతిభ

23-04-2025 12:58:40 AM

తిమ్మాపూర్, ఏప్రిల్22 (విజయ క్రాంతి): ఇంటర్ పరీక్షా ఫలితాల్లో కరీంనగర్ జిల్లాలోని ఎస్సార్ కళాశాలల విద్యార్థులు తమ ప్రతిభ చూపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ లోని ఎస్‌ఆర్ కళాశాలలో జోనల్ ఇన్చార్జ్ నేదూరి తిరుపతి మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. ఇంటర్ సెకండియర్ ఎంపీసీ విభాగంలో 990 మార్కులకు పైన 41మంది విద్యార్థులు, బైపీసీ లో 4గురికి ర్యాంకులు వచ్చినట్టు జోనల్ ఇంచార్జీ తెలిపారు. అలాగే ఇంటర్ ఫస్టియర్ లో ఎంపీసీ విభాగంలో 465మార్కులకు పైగా 63మంది విద్యార్థులు, బైపీసీ లో 435 మార్కులకు పైన ముగ్గురు విద్యా ర్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారన్నారు.

విద్యార్థులకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు, ప్రిన్సిపల్స్, అధ్యాపకులను ఆయన అభినందించారు. భవిష్యత్తులో ఎంట్రన్స్ పరీక్షల్లో ర్యాంకులు సాధించి మంచి కోర్సుల్లో చేరాలని సెకండియర్ విద్యార్థులకు ఆయన సూచించారు. భవిష్యత్తుకు ఇంటర్ మార్కులు పునాది అని సూచించారు. అలాగే సెకండియర్ లో సైతం మంచి మార్కులు సాధించి విద్యాసంస్థలు పేరు నిలబెట్టాలని మొదటి సంవత్సరం విద్యార్థులకు సూచించారు. తమ యాజమాన్యం, అధ్యాపకుల కృషితోనే ర్యాంకులు సాధించామని విద్యార్థులు చెప్పారు. విద్యార్థులను విద్యాసంస్థలు చైర్మెన్ వరదా రెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, డీజీఎం వాసుదేవ రెడ్డి, ప్రిన్సిపల్స్, అధ్యాపకులు అభినందించారు.