10-04-2025 12:00:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): అసిఫ్‌నగర్ దత్తాత్రేయ కాలనీలో ఉన్న ఎస్‌ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు ఇటీవల ద త్తాత్రేయ కమ్యూనిటీ హాల్‌లో వార్షికోత్స వం, గ్రాడ్యుయేషన్ డేను వేడుకగా నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉ పాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. చి న్నారుల ఉత్సాహభరిత ప్రదర్శనలు అందరినీ అలరించాయి. యూకేజీ విద్యార్థుల గ్రా డ్యుయేషన్ కార్యక్రమం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తల్లిదండ్రులు తమ పిల్లలు గ్రాడ్యుయేట్ అవుతుండటం చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్వేత మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ, విశ్వాసంతో ఎదుగుతారన్నారు. వారి విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల స హకారం చాలా అవసరమని చెప్పారు.