22-04-2025 06:30:08 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఎస్సార్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా స్థాయిలో మంచి మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ జోనల్ ఇన్చార్జి నాగేష్ తెలిపారు. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో కళాశాల చెందిన విద్యార్థులు ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో ఎం శ్రీనిధి 991 జి సృజన 986 బైపిసి విభాగంలో సిఎస్ శ్రీ వర్ష 992 బి వైష్ణవి 991 మార్కులు సాధించినట్టు వారు తెలిపారు.
ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీలో పీ లక్ష్మీ ప్రసన్న 467 స్వాతి 466 హైమద్ 466 సాహితీ 464 సిహెచ్ శ్రీజ 462 డి శ్రీనిధి 462 మార్కులు పల్లవి 462 వర్షిని 461 రస్మిత 461 మార్కులు సాధించినట్లు తెలిపారు, బైపీసీలో శ్రీవర్ష 438 అఖిలా 436 డి శ్రావణి 434 శరణ్య 434 మార్కులు సాధించినట్లు తెలిపారు, మార్కులు సాధించిన విద్యార్థులకు కళాశాలలో సన్మానం చేశారు.