రూ.12 కోట్లతో సంగారెడ్డిలో అభివృద్ధి పనులు
సంగారెడ్డి (విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేసేందుకు ప్రధాన చౌరస్తాల వద్ద విస్తరణ పనులు చేపడతామని, పనులు చేసేందుకు ప్రభుత్వం రూ. 12 కోట్లు మంజూరు చేసిందని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని అల్విన్ బైపాస్‌రోడ్డు, ఐబీ గెస్ట్‌హౌజ్ నుండి నేషనల్ హైవే సమీపంలోని గుర్రపు బొమ్మ వరకు 2.5 కిలోమీటర్లు ఈ రహదారిని విస్తరించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. మున్సిపల్, ఆర్అండ్బి, ఎలక్ర్టిసిటీ, హెచ్ఎండీఏ అధికారులతో కలిసి బైపాస్ రోడ్డులో పర్యటించారు. రోడ్డు మధ్యలో సింగిల్ స్టోన్‌తో డివైడర్ ఏర్పాటు చేయాలని, ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు.