calender_icon.png 15 January, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచర్ల బాత్‌రూంలోస్పై కెమెరా

19-12-2024 01:20:04 AM

* స్కూల్ డైరెక్టర్ వికృత చర్య

లక్నో, డిసెంబర్ 18: టీచర్ల బాత్‌రూంలో స్పై కెమెరా పెట్టి కటకటాల పాలయ్యాడు ఓ పాఠశాల డైరెక్టర్. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.  నోయిడాలోని ఓ ప్లే స్కూల్‌కు నవనీశ్ సహాయ్ అనే వ్యక్తి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. నవనీశ్ టీచర్లు వినియోగించే బాత్‌రూంలో స్పై కెమెరా పెట్టి, దానిని తన కంప్యూటర్, మొబైల్‌కు అనుసంధానించాడు. ఈనెల 10 ఓ ఉపాధ్యా యిని బాత్‌రూంకు వెళ్లి బల్బ్‌హోల్డర్‌లో స్పై కెమెరాను గుర్తించింది. వెంటనే యాజమాన్యానికి విషయం చెప్పగా, యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు రంగంలోకి దిగి పాఠశాలలో విచారణ చేపట్టారు. నవనీశ్‌ను నిందితుడిగా అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నవనీశ్ నేరం అంగీకరించగా, కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించారు.