23-04-2025 12:00:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): కాలొరెక్టల్ క్యాన్సర్ (సీఆర్‌సీ) వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో ఉంది. దాదాపు 10శా తం క్యాన్సర్ కేసులకు కారణమవుతుంది. భారతదేశంలో సీఆర్‌సీ వ్యాప్తి సంవత్సరానికి 20శాతం నుంచి 124శాతం వరకు పెరుగుతు న్నట్టు కొన్ని రిజిస్ట్రీలు పేర్కొంటున్నాయి. 45 ఏళ్లు పైబడిన వారికి కాంటినెంటల్ హాస్పిటల్‌లో గత 3 సంవ త్సరాలుగా సీఆర్‌సీకి సంబంధించి వందలాది రోగులకు కాలనోస్కోపీ పరీక్షలు చేశారు.
తమ అధ్యయనంలో పురుషుల్లో 28.03శాతం, మహిళల్లో 21.15శాతం మంది లో క్యాన్సర్‌కు ముందు గుర్తించే పాలిప్స్ కనుగొనబడ్డాయని కాంటినెంటల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ గురు ఎన్‌రెడ్డి తెలిపారు. వీటిని తొలగించకపోతే జీవిత కాలంలో క్యాన్సర్‌కు గురయ్యే అవకాశముంది. ఏసీజీ, అమెరికన్ క్యాన్సర్ సొసైటీ చూపించిన ప్రకారం కాలనోస్కోపీ స్క్రీనింగ్ ద్వారా సీఆర్‌సీ కేసులను గణనీయంగా తగ్గించవచ్చన్నారు.
ఈ వ్యాధి మరణభయాన్ని దృష్టిలో పెట్టుకుని 45 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలు స్క్రీనింగ్ కాలనోస్కోపీ తప్పనిసరిగా చేయించుకోవాలని డాక్టర్ గురు ఎన్‌రెడ్డి సూచించారు. గత మూడు సంవత్సరాల్లో కాంటినెంటల్ హాస్పిటల్‌లో సుమారు 2000 మందికి సీఆర్‌సీ స్క్రీనింగ్ కాలనోస్కోపీ నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమాల ఫలితంగా 25శాతం మందిలో పాలిప్స్ గుర్తించి, తొలగించామన్నారు.
33 మందిలో కా లనో రెక్టల్ క్యాన్సర్‌పే గుర్తించామని డాక్టర్ రెడ్డి పేర్కొన్నారు. కాలనోస్కోపీ ద్వారా చికిత్స ఖర్చులను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. భారతదే శంలో సాధారణంగా కాలన్ క్యాన్సర్ చికిత్స పొం దేందుకు సుమారు రూ.10 లక్షలు ఖర్చవుతుంది. ఈ 33 మందిని సరైన వయసులో స్క్రీనింగ్ చేస్తే, రూ.3.5 కోట్లు మరియు వారి ప్రాణాలను కూడా రక్షించగలిగేదని డాక్టర్ రెడ్డి తెలిపారు.
అమెరికాలో 40 ఏళ్ల అనుభవం, లక్షకుపైగా కాలనోస్కో పీ చేసిన అనుభవంతో డాక్టర్ రెడ్డి పలు ప్రివెంటివ్ స్ట్రాటజీలు భార త్లో ప్రవేశపెట్టారు. లింఛ్ సిండ్రో మ్, అధిక బరువు, ధూమపానం, అలసత్వపు జీవనశైలి, మద్యం సేవనం, చెడు ఆహారపు అలవా ట్లు ఉన్నవారు తక్షణమే స్క్రీనిం గ్ కాలనోస్కోపీ చేయించుకోవాలని సూచించారు.
కాలనోస్కోపీ ప్రక్రి య సురక్షితం, నొప్పిలేని విధంగా ఉంటుందని తెలిపారు. అనుభ వం ఉన్న వైద్యులతో 30-45 ని మిషాల్లో పూర్తవుతుందని డాక్టర్ ఎన్‌రెడ్డి వెల్లడించారు.