calender_icon.png 21 February, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటమి భయంతోనే నామీద దుష్ప్రచారం

16-02-2025 12:30:35 AM

* కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి

కరీంనగర్/ సిద్దిపేట, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): ఓటమి భయంతోనే కొందరు కుల రాజకీయాలతోపాటు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉద  సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితో కలిసి కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడి  మార్నింగ్ వాక్‌లో ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యాసంస్థల అధినేతగా ఎం  మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దానని, ప్రజా సేవకోసమే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. కులమతాలకు అతీతంగా తాను సేవ చేస్తున్నానని తెలిపారు. సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దుష్ప్రచారం చేసేవారు ప్రజలకు ఏం సేవ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్కపేద విద్యార్థిని చదివించారా, ఏ ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం కల్పించారా అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే కుల రాజకీయాలతో సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నారని, వారిని నమ్మి మోపోవద్దని కోరారు. మొదటి ప్రాధాన్య ఓటు వేసి ఎమ్మెల్సీగా ఆశీర్వదించాలని నరేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తర్వాత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.