రాష్ట్ర డీఎడ్ బీఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్
హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): నిరుద్యోగులకు నష్టంలేకుండా స్పౌజ్ బదిలీలు ఉండాలని రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం విద్యాశాఖ విడుదల చేసిన 834 మంది ఉపాధ్యాయ స్పౌజ్ జాబితాలో కొన్ని జిల్లాలకు ఎక్కువ మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారని పేర్కొన్నది.
నిరుద్యోగులకు నష్టం జరగకుండా వచ్చే డీఎస్సీలో జిల్లాల్లోని పోస్టులు తగ్గకుండా చూడాలని మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. హనుమకొండ, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, మేడ్చల్ జిల్లాలకు ఎక్కువ సంఖ్యలో స్పౌజ్ బదిలీలతో రావడంవల్ల రాబోయే డీఎస్సీపై ప్రభావం చూపనుందని పేర్కొంది. ఇలా క్లియర్ వేకెన్సీలపై ప్రభావం లేకుండా చూడాలని విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేసింది.