calender_icon.png 17 October, 2024 | 4:59 AM

మహిళా లా కాలేజీలో 29 సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్

17-10-2024 02:43:16 AM

ఎస్సీ గురుకుల కార్యదర్శి అలుగు వర్షిణి

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయ క్రాంతి): హైదరాబాద్‌లోని సాంఘిక సంక్షే మ గురుకుల మహిళా ‘లా’ కళాశాలలో ఐదే ళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో 29 సీట్లు ఖాళీ ఉన్నాయని, వాటిని భర్తీ చేసేందుకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ఎ స్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి బుధ వారం ఒక ప్రకటనలో తెలిపారు. 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సా యంత్రం 5 గంటల వరకు భర్తీ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు.

ఎస్సీ కేటగిరీలో 18, బీసీ-ఏ కేటగిరీలో 1, బీసీ-బీ కేటగిరీలో 1, బీసీ-సీ కేటగిరీలో 2, మైనార్టీ కేటగిరీలో 4, ఈబీసీ/ఓసీ కేటగిరీలో 3 వేకెన్సీస్ ఉన్నాయని వెల్లడించారు. టీజీలాసెట్-2024 పరీక్షలో సాధించిన ర్యాంకుల మెరిట్ ప్రకారం అడ్మిషన్స్ ఇ వ్వనున్నట్టు స్పష్టం చేశారు. ఇతర వివరా ల కోసం ప్రిన్సిపల్ (9603617134)ను సంప్రదించాలని ఆమె సూచించారు.