కరీంనగర్,(విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి బ్యాడ్మింటన్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా బ్యాడ్మింటన్ క్రీడాకారులు అన్ని పోటీలలో పైచేయి సాధించడం చాలా గొప్ప విషయమని వారి స్పూర్తి క్రీడా రంగానికి మార్గదర్శకమని ఉమ్మడి మెదక్- నిజామాబాద్- అదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డా.వి.నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక కరీంనగర్ లో డా.బి.ఆర్.అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులకు వారి సొంత నిధులతో క్రీడా దుస్తులు సమకూర్చి పంపిణీ చేసి ఫ్రెండ్లి టోర్నమెంట్ ను ప్రారంభించి శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా క్రీడారంగానికి చేయుతనిస్తున్న వారిని పలువురు క్రీడాకారులు అభినందిస్తూ రానున్న ఎన్నికలలో విజయం వైపు పయనించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు గుంటపల్లి స్వామి, రవీందర్ రెడ్డి, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు