హుస్నాబాద్‌లో క్రీడాకారులకు బహుమతులు అందిస్తున్న మంత్రి పొన్నం
- స్టేట్ లెవెల్ స్పోర్ట్స్‌కు హుస్నాబాద్ వేదిక కావాలి
- రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, నవంబర్ 10: సియోల్‌లో స్పోర్ట్స్ యూనివర్సిటీని చూసిన తర్వాత స్ఫూర్తి పొందే రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఇండోర్ స్టేడియంలో అండర్ విభాగంలో జరిగిన ఎస్‌జీఎఫ్ స్టేట్ లెవెల్ హ్యాండ్‌బాల్ 68వ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
పోటీల్లో గెలుపొందిన ఆదిలాబాద్, వరంగల్ గర్ల్స్, కరీంనగర్, వరంగల్ బాయ్స్ జట్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో హుస్నాబాద్ నుంచి అధిక సంఖ్యంలో అడ్మిషన్లు పొందాలన్నారు. స్టేట్ లెవెల్ స్పోర్ట్స్‌కు హుస్నాబాద్ వేదిక కావాలని.. ఆ స్థాయిలో ఇక్కడి స్టేడియాన్ని డెవలప్ చేస్తామన్నారు. హుస్నాబాద్‌లో రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు జరగడం సంతోషంగా ఉందన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రజిత, ఎంఈవో మనీల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ అనిత పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాద బాధితులకు అండగా పొన్నం..
కొండపాక నవంబర్10: సిద్దిపేట జిల్లా కుక్కునూర్‌పల్లి మండలం కొడకండ్ల సబ్‌స్టేషన్ ఎదుట అదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. అయితే హుస్నాబాద్‌లో కార్యక్ర మంలో పాల్గొన్న అనతంరం అటుగా వెళ్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్.. ప్రమాద స్థలంలో క్షతగాత్రులను దగ్గరుండి మరీ అంబులెన్స్‌లో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులతో పోలీస్ సిబ్బందిని పంపిచి..
గజ్వేల్ కాంగ్రెస్ నాయకులకు ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులకు మెరు గైన చికిత్స అందేలా చూడాలని మంత్రి సూచించారు. డీసీఎం డ్రైవర్ సయ్యద్ అలీ ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వకుండా బ్రేక్ వెయ్యడంతో వెనకనే వస్తున్న ఆటో డీసీఎంకు తగిలి ప్రమాదం జరిగిందని.. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కుక్కునూర్‌పల్లి ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.