నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం క్రీడోత్సవాలను నిర్వహించారు. ఈ పోటీలను నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గంట ఈశ్వర్ ప్రారంభించి విద్యార్థులకు క్రీడలు ఎంతో అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శశిధర్, ఆకాష్, శివకుమార్, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.