calender_icon.png 26 December, 2024 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12 ఎకరాల్లో స్పోర్ట్స్ స్టేడియం

04-11-2024 01:54:11 AM

  1. స్పోర్ట్స్ హబ్‌గా మంచిర్యాల
  2. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి

మంచిర్యాల, నవంబర్ 3 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా మారుస్తామని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. ఆదివారం స్థలాన్ని పరిశీలించిన వారు మాట్లాడుతూ 14 ఎకరాల స్థలంలో రెండు ఎకరాలను నర్సింగ్ కాలేజీకి కేటాయించడం జరిగిందని, మిగితా 12 ఎకరాల్లో ఇండోర్ స్టేడియం నిర్మిస్తామని తెలిపారు.

అందులో ఇండోర్ , అవుట్ డోర్ గేమ్స్, స్విమ్మింగ్ ఫూల్ నిర్మిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకువచ్చి క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని వారు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సాహిస్తుందని పేర్కొన్నారు. యువకులు చెడు మార్గం పట్టకుండా క్రీడల వైపు మళ్లించేందుకు క్రీడాభివృద్ధికి పాటుపడుతున్నామని వారు తెలిపారు.