calender_icon.png 13 January, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలు స్నేహపూర్వకంగా ఆడాలి

13-01-2025 01:10:37 AM

పేట జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట్ల మధుసూదన్ రెడ్డి

నారాయణపేట, జనవరి 12 (విజయక్రాంతి): ప్రతి క్రీడాకారుడు క్రీడలను స్నేహపూర్వకంగా ఆడాలని నారాయణపేట జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట్ల మధుసూదన్ రెడ్డి అన్నారు ఆదివారం మండల పరిధిలోని జాజాపురంలో కొనసాగుతున్న జి పి ఎల్ క్రికెట్ పోటీలను ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గత ఐదు సంవత్సరాల నుండి జీపీఎల్ క్రికెట్ పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు అంతే కాకుండా ప్రతి క్రీడాకారుడు ఆత్మవిశ్వాసంతో స్నేహపూర్వకంగా పోటీలలో పాల్గొని విజయం సాధించాలని ఆయన కోరారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి క్రీడలు ఏర్పాటు చేయడం తో ఆయన నిర్వాహకులకు అభినందించారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఈ క్రికెట్ పోటీలలో మొదటి బహుమతి 40000 జిల్లా కాంగ్రెస్ యువజన అధ్యక్షులు కోట్ల మధుసూదన్ రెడ్డి ఇస్తున్నట్లు వారు తెలిపారు అదేవిధంగా ఆదివారం జరిగిన క్రికెట్ క్రీడాకారులతోపాటు పోటీలను తిలకించే ఎందుకు వచ్చిన ప్రజలకు కూడా అన్నదాన కార్యక్రమాన్ని మన్నే సురేష్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. 

క్రీడాకారులకు మరియు క్రీడలు తిలకించేందుకు వచ్చిన వారికి భోజన సౌకర్యం కల్పించిన  మన్నె సురేష్ కు నిర్వాహకులు కతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జే పీ ఎల్ క్రికెట్ నిర్వాహకులు ఆలుగడ్డ రవికుమార్ వై వెంకటేష్ కే లక్ష్మణ్ పి హరీష్ గౌడ్ పి శివకుమార్ గౌడ్ లతోపాటు క్రీడాకారులు గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.