calender_icon.png 23 February, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలి

30-01-2025 12:00:00 AM

కలెక్టర్ గౌతం 

మేడ్చల్, జనవరి 29(విజయ క్రాంతి): విద్యార్థులను చదువుతోపాటు క్రీడలలోనూ ప్రోత్సహించాలని కలెక్టర్ గౌతం అన్నారు. బుధవారం హకీంపేట్ లోని తెలంగాణ స్టేట్ స్పోరట్స్ స్కూల్ ను కలెక్టర్ గౌతమ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పోరట్స్ స్కూల్లో  టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటి రాకెట్ క్రీడలను ప్రోత్సహించాలని స్పెషల్ ఆఫీసర్ కు సూచించారు.

విద్యార్థుల తరగతి గదులు, క్రీడల ప్రాక్టీస్ హాలులు, డైనింగ్ హాల్, మైదానంలో కలియతిరిగి పరిశీలించారు. విద్యార్థులకు అందించే మెనూ చార్టును పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెడుతున్నారని అడిగి తెలుసుకున్నారు.

క్రీడల ప్రాక్టీస్ హాల్లో పరికరాలను పరిశీలించారు. ఓపెన్ గ్రౌండ్ లో వీక్షకులకు సిట్టింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ రావు, జిల్లా యువజన క్రీడల అధికారి గోపాలరావు, ప్రిన్సిపాల్ ప్రకాష్, మెడికల్ ఆఫీసర్ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.