05-03-2025 12:00:00 AM
మంచిర్యాల, మార్చి 4 (విజయక్రాంతి): గిరిజన సంక్షేమ శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మూడు క్రీడ పాఠశాలలకు, హైద రాబాద్ బోయిన్ పల్లిలోని వాటర్ స్పోరట్స్ అకాడమీ క్రీడ పాఠశాలలో విద్యార్థుల ఎంపిక పోటీలు ఈ నెల 7న నిర్వహి స్తున్నట్లు ఐటీడీఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ కుష్బూ గుప్తా, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జాదవ్ అంబాజీలు మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. నైపుణ్యం కలిగిన గిరిజన విద్యార్థినీ, విద్యార్థుల కోసం మంచి ర్యాలలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠ శాలలో మంచిర్యాల జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.
మంచి ర్యాల జిల్లాలోని ఏ పాఠశాలలోనైనా నాల్గవ తరగతి, ఐదో తరగతి చదువుతూ 2016, సెప్టెంబర్ 1 నుంచి 2017, ఆగష్టు 31 మధ్య లో జన్మించిన గిరిజన విద్యార్థినీ విద్యార్థులు అర్హులని, ఎంపిక పోటీలకు వచ్చే వారు వారి పాఠశాల నుంచి భోనాపైడ్ సర్టిఫికేట్, ఎలిజిబిలిటీ ఫామ్, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్ పోర్ట్ ఫొటో వెంట తీసుకొని తీసుకు రావాలని కోరారు. మరిన్ని వివరాలకు జిల్లా గిరిజన క్రీడల అధికారి బండ జీవరత్నం (94407 42726)ని సంప్రదించాలన్నారు.