calender_icon.png 13 November, 2024 | 7:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలు శరీరక మానసిక ఉల్లాసాన్నిస్తాయి

10-11-2024 12:04:27 PM

నిజామాబాద్ (విజయక్రాంతి): క్రీడలు శారీరక మానసిక ఉల్లసాన్నిస్తాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో కైసర్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 9వ భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మెమోరియల్ అథ్లెటిక్స్ ఫెస్టివల్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు ఆటల్లో గెలుపోవటములను లెక్కచేయకుండా పాల్గొనాలని కోరారు. అథ్లెటిక్స్ ఆరోగ్యంతో పాటు శారీరక మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. క్రీడల్లో నైపుణ్యతను సాధించేందుకు కీడా పోటీల్లో పాల్గొనాలని క్రీడాకారులకు సూచించారు. అథ్లెటిక్స్ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో కైసర్ అకాడమీ ప్రతినిధులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మార గంగారెడ్డి, కాటిపల్లి నగేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.