calender_icon.png 14 January, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి

14-01-2025 01:05:01 AM

 నారాయణపేట, జనవరి 13(విజయ క్రాంతి): భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య భారత విద్యార్థి ఫెడరేషన్, సంఘాల ఆధ్వర్యంలో కోటకొండ గ్రామంలో సంక్రాంతి క్రీడలను సిఐటియు జిల్లా కార్యదర్శి బాల్ రామ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కబడ్డీ, కోకో వాలీబాల్, పరుగు పందెం తదితర ఆటలతో క్రీడాకారులకు మానసిక ఉల్లాసాన్ని , ఆరోగ్యాన్ని అందిస్తాయని అన్నారు .

క్రీడాకారుల నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడలు ఎంతో విజయవంతంగా కొనసాగుతున్నాయని నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో. దస్తప్ప  బాలప్ప,యుటిఎఫ్ జిల్లా నాయకులు శీలం మోహన్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సాయిబాబా ఎస్‌ఎఫ్‌ఐ ఓయూ నాయకులు మల్లేష్ , ప్రజానాట్యమండలి నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు.