09-02-2025 01:17:30 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాం తి): క్రీడలతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఐఎంఏ(ఇండియన్ మెడికల్ అసోసియేషన్) ఆధ్వర్వంలో క్రికెట్ లీగ్ పోటీలు శనివారం సంగారెడ్డిలో ఆయన ప్రారంభించారు. ఈ పోటీలకు తెలంగాణ పది జిల్లాల నుంచి డాక్టర్ల టీమ్‌లు హాజరయ్యాయి.
జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. శాప్ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమన్నారు. కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్, ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచందర్ నాయక్, మోతిలాల్, కూన సంతోశ్, కిరణ్ పాల్గొన్నారు.