02-04-2025 04:18:28 PM
జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్..
కొత్తగూడెం (విజయక్రాంతి): క్రీడలు మానసిక ఉల్లసాన్ని పెంపొందిస్తాయని జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు. బుధవారం రాజేందర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం స్టేడియం గ్రౌండ్ లో ప్రారంభమైన భద్రాద్రి కొత్తగూడెం ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీలకు ముఖ్యఅతిథిగా యెర్రా కామేష్ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకొని, టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... యువత ఏ పోటీల్లో అయినా గెలుపు ఓటములు సహజమని అన్నారు. గెలిచినా వారు ఇంకా శ్రమిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించలని, ఓడిన వారు మరింత పట్టుదలతో ఆడుతూ గెలుపు దిశగా అడుగులు వేయాలన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడం కొరకు క్రీడాకారులను అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రతీ సంవత్సరం క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.
క్రికెట్ పోటీలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ముందుగా టోర్నమెంట్ జెర్సీలను ఆవిష్కరించారు. మొదటి మ్యాచ్ మిఠాయి పొట్లం జట్టుకి, సురక్ష డైమాండ్స్ జట్ల మధ్య జరగగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మిఠాయి పొట్లం జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 141 రన్స్ చేయగా తర్వాత బ్యాటింగ్ చేసిన సురక్ష డైమాండ్స్ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 108 రన్స్ చేయాగ మిఠాయి పొట్లం జట్టు 33 రన్స్ తేడాతో గెలుపొందారు. ఈ కార్యక్రమంలో అరోరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ చైర్మన్ తాళ్లూరి హరిబాబు, రాజేందర్ సేవా సంస్థ అధ్యక్షుడు యెర్రా సర్వేశ్, దేవర్ల రాజు, లింగేష్, రాజ రమేష్, కె.నగేష్ తదితరులు పాల్గొన్నారు.