calender_icon.png 24 December, 2024 | 7:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందని ద్రాక్షలా క్రీడాప్రాంగణాలు

24-12-2024 12:14:24 AM

  1. వసతులు లేక వెలవెలబోతున్న వైనం 
  2. బోర్డులకే పరిమితమైన క్రీడాప్రాంగణాలు 

వనపర్తి, డిసెంబర్ ౨౩ ( విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికి తీయాలని ఉద్దేశంతో గత ప్రభుత్వం ఏర్పా టు చేసిన క్రీడా ప్రాంగణాల్లో సరైన వసతులు లేకపోవడం, గ్రామాలకు దూరంగా ఉండటంతో క్రీడాకారులకు అందని ద్రాక్షలా మారాయి.

క్రీడా ప్రాంగణాల ఏర్పాటు సమయంలో గ్రామాల్లో గల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి అక్కడ ఉన్న మట్టిని చదును చేసి నాలుగు స్థంభాలను పాతి క్రీడాప్రాంగణంగా బోర్డు పెట్టి సంబంధిత అధికారులు చేతులు దులుపుకున్నారు.

అప్పటి నాయకులు ఆ క్రీడాప్రాంగణాలను ప్రారంభించి తమకేమి సంబంధం లేనట్లుగా పట్టించుకోకపోవడంతో క్రీడా ప్రాంగణాలన్నీ చెత్తాచెదా రంతో నిండిపోయాయి. క్రీడాప్రాంగణాల పేరిట లక్షల్లో ఖర్చు పెట్టి ఎలాంటి వసతులు కల్పించకపోవడంతో క్రీడాకారులు ఎవరూ కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. 

బోర్డులకే పరిమితం ..

జిల్లాలో చాలావరకు చెట్టు, చెత్తా చెదారంతో దర్శనమిస్తున్నాయి. ఎకరం, అర్ధ ఎకరానికి తగ్గకుండా స్థలాలను ఎంపిక చేసి వాటిల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, లాంగ్ జంప్, క్రీడా కోర్టులను నిర్మించాలని నిర్ణయించారు. అందుకుగాను ఒక్కో క్రీడా ప్రాం గణానికి రూ.లక్షల్లో నిధులిచ్చారు. స్థలాల ఎంపిక నుంచే క్రీడా ప్రాంగణాల ఏర్పాటు గాడి తప్పింది. గ్రామాలకు దూ రంగా ఉన్న స్థలాలు అధికారులు ఎంపిక చేయడంతో క్రీడాకారులతో కళకళలాడాల్సిన ప్రాంగణాలను బోర్డులకే పరిమితమయ్యాయి.

కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా అందుబాటులోకి వచ్చేనా ...

గత ప్రభుత్వం హయాంలో సరై న వసతులు కల్పించక పోవడంతో క్రీడా ప్రాంగణాలన్నీ చాలావరకు దిష్టిబొమ్మలా ఆయా గ్రామాల్లో ద ర్శనమిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయి న సందర్భంగా సీఎం కప్ క్రీడలు అంటూ గ్రామాలు నుంచి మొదలుకుని రాష్ట్ర స్థాయిల్లో విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు.

క్రీడల పట్ల ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని ఇటీవల రాష్ట్ర స్పో ర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి సైతం చెప్పారు.  ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకుని వస్తే గ్రామ స్థాయి నుంచి క్రీడాకారులను తయారు చేయవచ్చని ప్రజలు కోరుతున్నారు.