జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్
కోరుట్ల, జనవరి 21 (విజయక్రాంతి): యువత ఆరోగ్యం కాపాడుకోవడానికి, స్నేహభావం పెంపొందించుకోవడానికి క్రీడలే ముఖ్యమని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ క్రీడా మైదానంలో మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు స్మారకార్థం నిర్వహిస్తున్న కోరుట్ల ప్రీమియర్ లీగ్ కేపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ ను కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాముఖ్యతనిచ్చి యంగ్ ఇండియన్ స్పోరట్స్ యూనివర్సిటీని హైదరాబాద్లో స్థాపించడం జరిగిందని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ మాజీ మంత్రి రత్నాకర్’రావు స్మారకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు.
25 రోజులు జరగనున్న ఈ క్రికెట్ టోర్నమెంట్లో 12 జట్లు పోటీ పడుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జివాకర్’రెడ్డి, మెట్పెల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, సీఐ సురేష్ బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.