కరీంనగర్ సిటీ, ఫిబ్రవరి1: స్థానిక జగిత్యాల రోడ్ లోని వివేకానంద రెసిడెన్షియల్ (సీబీఎస్‌ఈ)పాఠశాలలో క్రీడా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వ హించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జనరల్ సెక్రటరీ తెలంగాణ జూడో అసోసియేషన్ గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, డిస్ట్రిక్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్.శ్రీనివాస్ గౌడ్ ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ గండ్ర లక్ష్మణరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారుల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. ,ప్రతి విద్యార్థి క్రీడ ల్లో చురుగ్గా పాల్గొని శారీరక, మానసిక ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ప్రతి ఒక్కరూ పెద్దవారిపట్ల గౌరవభావంతో మెలగాలని తెలియజేశారు. అనంతరం వివిధ రకాల శక టాల ప్రదర్శనలు నిర్వహించారు.
అందులో కత్రిమ మేధస్సు, సుస్థిరాభివద్ధి, 2024 లో భారత దేశం సాధించిన విజయాలు, కరీంనగర్ పట్టణ గొప్పతనాన్ని తెలియజేసే శకటాల ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ డాక్టర్ పొల్సాని సుధాకర్ రావు, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ టి.లలితా కుమారి, ప్రిన్సిపల్ రేణుక బలివాడ పాల్గొన్నారు.